కాళేశ్వరాన్ని బద్నాం చేసి రాష్ట్రానికి అప్రతిష్ట తీసుకురావొద్దు : కేటీఆర్

-

రాజకీయాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయవద్దని ప్రతిపక్షాలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచించారు. కాళేశ్వరాన్ని బద్నాం చేసి రాష్ట్రానికి అప్రతిష్ట తీసుకురావొద్దని కోరారు. కాళేశ్వరం కామధేను, కల్పతరువు అని.. దేశంలో ప్రతి ఒక్కరు చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది అని తెలిపారు. కాళేశ్వరాన్ని నాలుగేళ్లలో పూర్తి చేశామన్న కేటీఆర్.. 45 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా 2 పంటలకు నీరు అందిస్తున్నామని చెప్పారు. గృహ అవసరాలు, పరిశ్రమలకు కాళేశ్వరం ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

“కాళేశ్వరం సామర్థ్యం 160 టీఎంసీలు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు. కాళేశ్వరంలో 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్‌, 203 కిలోమీటర్ల టన్నెల్‌. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సర్వసాధారణం. ప్రకాశం, ధవళేశ్వరం, కడెం జలాశయాల్లోనూ సమస్యలు వచ్చాయి. సాగర్ కట్టిన తర్వాత కూడా లీకేజీ సమస్యలు వచ్చాయి. రెండేళ్ల క్రితం శ్రీశైలం పంపులు కూడా నీట మునిగాయి. ఇంజినీరింగ్‌ నిర్మాణం లోపం ఉంటే పునరుద్ధరిస్తామని నిర్మాణ సంస్థ చెప్పింది. మిషన్‌ కాకతీయ ద్వారా 46 వేల చెరువులకు పునరుజ్జీవం వచ్చింది. ప్రాజెక్టుల కోసం రూ.లక్షా 70 వేల కోట్లు ఖర్చు చేశాం. ప్రపంచలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాం. కాల్వలు తవ్వి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశాం. రైతుల ఆదాయం పెంచడం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేసింది. పాడి, పంటపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది.” అని కేటీఆర్ వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news