కౌలు రైతు రైతే కాదన్న వ్యాఖ్యలు నాకు బాధకలిగించాయి : పవన్ కల్యాణ్

-

తెలంగాణలో 19 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కౌలు రైతులు రైతే కాదని కొంతమంది చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులపై చూలకనగా మాట్లడకూడదని విజ్ఞప్తి చేశారు. ధరణి విఫలమైందని ప్రభుత్వం కూడా ఒప్పుకుంటుందని అన్నారు. తెలంగాణ, ఏపీలో ఎన్నికలు ఐదేళ్లకు ఒకేసారి జరగాలని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రంలోనూ ప్రతి సంవత్సరం ఎన్నికల లాగానే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు.

“యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి. మోదీ నాయకత్వంలోనే ఉపాధి అవకాశాలు వస్తాయని బలంగా విశ్వసిస్తున్నాను. మోదీ మూడోసారి ప్రధాని కావాలన్నదే నా ఆకాంక్ష. తెలంగాణ, దేశంలోనూ బీజేపీ సర్కార్‌ రావాలి. కేంద్రంలో రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ ఉంటేనే అభివృద్ధి సాధ్యం. కేసీఆర్‌, కేటీఆర్‌, రేవంత్‌ రెడ్డి, వీహెచ్‌తో పరిచయాలు ఉన్నాయి. అన్ని పార్టీల నాయకులతో పరిచయం ఉన్నప్పటికి మోదీ, బీజేపీకే నా మద్దతు. స్నేహం వేరు.. రాజకీయాలు వేరు. తెలంగాణలో బీసీని సీఎం చేయగలిగేది మోదీ నేతృత్వంలోని బీజేపీనే. 50 శాతం ప్రజల ఉన్న రాష్ట్రంలో కచ్చితంగా బీసీనే సీఎం అవ్వాలి. 32 మంది జనసైనికులు పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నారు. బీసీ ఎజెండాతో వస్తున్న బీజేపీకి త్యాగం చేయాలని చెప్పాను. నా మాట విని 26 మంది పోటీ చేయాలన్న ఆలోచన విరమించుకున్నారు.” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news