ఎన్నికల్లో గెలిచేందుకు మంత్రి హరీశ్ రావు తండ్రి, కుమాడిని విడదీశారని అందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్ ఆరోపించారు. రాజకీయం కోసం తనకు రక్త సంబంధాన్ని దూరం చేశారని కంటతడి పెట్టారు. సంగారెడ్డి జిల్లా రాయికోడు గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
“మంత్రి హరీశ్ రావు నా కుటుంబంలో చిచ్చుపెట్టి నా కుమారుడైనా ఉదయ్ భాస్కర్‌ను దూరం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించేందుకు. నా కుమాడితో డబ్బులు పంపిణీ చేయిస్తున్నారు. అన్నా.. అని ఆప్యాయంగా పలకరించే హరీశ్ రావు.. ఉదయ్ భాస్కర్ ను సిద్దిపేట పిలిచిమరి పార్టీలో చేర్చుకొని.. ఉదయ్ పేరున నా పేరు చేర్చి.. ఉదయ్ బాబు మోహన్‌గా ప్రచారం చేయించడం తప్పు కదా. ఆయనకు ల్టా, పల్టా రాజకీయాలు, గందరగోళ రాజకీయాలు బాగా వస్తాయి. బీఆర్ఎస్ అవినీతి పాలన త్వరలోనే అంతం అవుతుంది. రాష్ట్ర ప్రజలంతా బీఆర్ఎస్ నేతల తీరును గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కచ్చితంగా వారికి బుద్ధిచెబుతారు. శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు బీజేపీకే పట్టం కడతారు.” అని బాబు మోహన్ అన్నారు.