బిగ్​బాస్-7 నుంచి మరో ఇద్దరు ముద్దుగుమ్మలు ఎలిమినేట్

-

బిగ్‌బాస్‌ సీజన్‌-7 రోజురోజుకు ఇంట్రెస్టింగ్​గా మారుతోంది. గ్రాండ్ ఫినాలే దగ్గర పడుతున్న కొద్దీ ఆటలో ఇంటెన్సిటీ పెరుగుతోంది. గత వార ఎలిమినేషన్ లేదని చెప్పిన హోస్ట్ నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్టే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అయితే ఈ సీజన్ మొదటి నుంచి ఫిమేల్ కంటెస్టెంట్లనే బయటకు పంపిస్తున్న బిగ్ బాస్ మధ్యలో సందీప్ మాస్టర్, బోలే శావలితో కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు.

అంతా అనుకున్నట్లే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అశ్విని, రతిక ఎలిమినేట్‌ అయ్యారు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీగా వచ్చిన అశ్విని మొదటి నుంచి అంత యాక్టివ్​గా లేకపోవడం.. హౌస్ మేట్స్​తో అంతగా కలిసిపోకవడం మైనస్​గా మారాయి. కానీ కొంతవరకు తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను అలరించింది. మరోవైపు కొన్ని వారాల కిందట ఎలిమినేట్‌ అయిన రతిక, మళ్లీ హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే, రెండోసారి మాత్రం తన ఆట తీరును ఏ మాత్రం మెరుగుపరుచుకోలేకపోవడంతో తాజాగా ఎలిమినేట్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news