మార్క్ జుకర్​బర్గ్​కు షాక్.. మెటాపై 33 అమెరికా రాష్ట్రాల దావా

-

ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల మాతృ సంస్థ ‘మెటా’ సంస్థపై అమెరికాలోని పలు రాష్ట్రాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. 13 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచాన్ని సేకరించిందని దావాలో ఆరోపించాయి. గత నెలలో వేసిన ఈ దావాలోని వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. యుక్త వయసు పిల్లలను ప్రలోభపెట్టడానికి శక్తిమంతమైన సాంకేతికతలను మెటా ఉపయోగిస్తోందని అమెరికాలోని 33 రాష్ట్రాలు దావాలో పేర్కొన్నాయి. చిన్నారులు, యుక్తవయసు పిల్లల సమాచారాన్ని తారుమారు చేయడం వంటి విషయాలను ఈ సంస్థ దాచిపెట్టిందని తెలిపాయి.

తల్లిదండ్రుల అనుమతి లేకుండా 2019 నుంచి 13 ఏళ్ల కంటే తక్కువ వయసున్న లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌  యూజర్ల సమాచారాన్ని తీసుకుందని ఆరోపణలు చేశాయి. అత్యధిక సమయం సామాజిక మాధ్యమాల్లో గడిపే విధంగా బిజినెస్‌ మోడల్‌ను ‘మెటా’ రూపొందించిందని ఆయా రాష్ట్రాలు వేసిన దావాలో పేర్కొన్నాయి. ఈ రాష్ట్రాలు చేసిన ఆరోపణలపై స్పందించిన మెటా .. 13ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ ఖాతాలు తెరిచేందుకు అనుమతి లేదని, అటువంటి ఖాతాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే తొలగించే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news