సొంత గడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్(Bangladesh) గెలుపు దిశగా పయనిస్తోంది. బంగ్లా బౌలర్లు చెలరేగడంతో కివీస్ ఆలౌట్ ప్రమాదంలో పడింది. భారీ లక్ష్య ఛేదనలో పర్యాటక జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రమాదకరమైన డెవాన్ కాన్వే(22), తొలి ఇన్నింగ్స్ సెంచరీ బాదిన కేన్ విలియమ్సన్(11), టామ్ బండిల్(6)లను పేసర్ తైజుల్ ఇస్లాం ఔట్ చేశాడు. దాంతో, బ్లాక్‌క్యాప్స్ ఓటమి తప్పించుకునేందుకు పోరాడుతోంది. చేతిలో 3 వికెట్లు ఉన్నాయంతే. ఇంకా న్యూజిలాండ్ విజయానికి 250 పరుగులు కావాలి. ఇస్లాం, మిచెల్ క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 310 పరుగులకు ఆలౌట్ అయింది. గ్లెన్ ఫిలిఫ్స్ వికెట్లు తీసి బంగ్లాను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్‌ను విలియమ్సన్(104) సెంచరీతో ఆదుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(105 198 బంతుల్లో 10 ఫోర్లు) శతకంతో చెలరేగి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. స్పిన్నర్ అజాజ్ పటేల్(Ajaz Patel) నాలుగు వికెట్లతో రాణించాడు.