ఏపీలో ఎన్నికలకు ఇంకా 100 రోజుల సమయం మాత్రమే ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవాళ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్. జనసేనలో యువత కమిట్ మెంట్ చూసి పార్టీని గుర్తించారు.
జనసేన పార్టీ పెట్టినప్పుడు ధైర్యం తప్ప ఏమి లేదు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగానలో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పటికి పోటీ చేయలేకపోయిందని తెలిపారు. తెలంగాణలో కూడా జనసేన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లలో పోటీ చేస్తుంది. ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం అని చెప్పిన బీజేపీ కూడా మనతో కలిసి వస్తుందన్నారు. గతంలో కూడా పౌండర్ మెంబర్ ని.. అయినప్పటికీ నేను ఏ పదవీ కోరుకోలేదు. హైదరాబాద్ మహానగరంలో 55 శాతం పోట కాలేదు 1 అని స్పష్టం చేశారు. ఏపీలో జనసేనకు ఆరున్నర లక్షల కేడర్ ఉందని వెల్లడించారు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్.