తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తాం : సీఎం కేసీఆర్

-

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం దాదాపు అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ రకరకాలుగా ఫలితాల గురించి ఓ అంచనా వేస్తున్నాయి. అయితే తాజాగా సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని స్పష్టం చేశారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ గురించి అస్సలు నమ్మకూడదని సూచించారు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, మంత్రులు మరోసారి అధికారంలోకి వస్తామని భరోసా ఇచ్చినట్టు తెలిపారు.


ప్రగతి భవన్ లో తనను కలిసిన పలువరు నేతలతో ఎన్నికల సరళి గురించి చర్చించినట్టు తెలిపారు. ఎవ్వరూ ఆగం కావద్దు.. పరిషాన్ కావద్దని సూచించారు. డిసెంబర్ 03న సంబురాలు జరుపుకుందామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ నెల 4వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ స‌చివాల‌యంలో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నున్నది. ఈ మేర‌కు తెలంగాణ సీఎంవో ప్ర‌క‌ట‌న జారీ చేసింది. తెలంగాణ మూడో శాస‌న‌స‌భ‌కు న‌వంబ‌ర్ 30న ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఓట్ల లెక్కింపు డిసెంబ‌ర్ 3వ తేదీన జ‌ర‌గ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news