ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పెను ముప్పు ఉంది. మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది. గడిచిన 20 సంవత్సరాల్లో నిజాంపట్నం హార్బర్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి. బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది.
ఈ క్రమంలో బాపట్ల జిల్లాలోని రేపల్లే, బాపట్ల, చీరాల నియోజకవర్గాల్లో సముద్ర తీర ప్రాంతం ఉండగా, నిజాంపట్నం హార్బర్ లోనే 10వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో రేపల్లె నియోజకవర్గంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. కాగా, గడిచిన 20 సంవత్సరాల్లో నిజాంపట్నం హార్బర్ లో పదో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం ఇదే మొదటిసారి.
ఇక అటు తూఫాన్ ప్రభావం తో విశాఖలోని మత్సకార గ్రామాలు బిక్కుబిక్కు మంటున్నాయి.. ఓవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం, మరోవైపు భీకర గాలులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.. తీరానికి ఆనుకొని ఉన్న జాలరి పేట, సాగర్ నగర్, జోడుగుల్ల పాలెం, మువ్వల వాని పాలెం, ఉప్పాడ, తిమ్మాపురం లోని వేలాది మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు..