ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులతో దిల్లీలో హై అలెర్ట్

-

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌’ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ మరోసారి భారత్‌పై బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. డిసెంబర్ 13కు ముందు పార్లమెంట్‌పై దాడి చేస్తామంటూ అతడు విడుదల చేసిన వీడియో కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీలో అలర్ట్ ప్రకటించారు.

ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ నాలుగున మొదలైన ఈ సమావేశాలు.. డిసెంబర్ 22 వరకు కొనసాగనున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 13లోగా పార్లమెంట్‌పై దాడికి పాల్పడతామని పన్నూ చేసిన బెదిరింపులను.. భద్రతా సంస్థలు తీవ్రంగా పరిగణించాయి. ఈ క్రమంలో పార్లమెంట్ ప్రాంగణమంతా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు భద్రతాధికారి తెలిపారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

 2001లో సరిగ్గా డిసెంబర్ 13నే పార్లమెంట్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడికి సూత్రధారి అయిన అఫ్జల్‌ గురు పోస్టర్‌.. పన్నూ ప్రస్తుతం విడుదల చేసిన వీడియోలో దర్శనమివ్వడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. తనను చంపేందుకు భారత ఏజెన్సీలు కుట్ర చేశాయని, దానికి ప్రతిస్పందనగానే ఈ దాడి ఉంటుందని పన్నూ బెదిరించడం కొసమెరుపు.

Read more RELATED
Recommended to you

Latest news