‘పుష్ప’ ఫేం జగదీశ్‌ను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు

-

‘పుష్ప’ ఫేం జగదీశ్ గురించి తెలియని వారుండరు. అదేనండి ఆ సినిమాలో అల్లు అర్జున్‌ పక్కన కేశవ పాత్రలో కనిపించిన సహాయ నటుడిపై పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ జూనియర్‌ అర్టిస్టు మరో వ్యక్తితో ఉన్నప్పుడు ఫొటోలు తీసి వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు పాల్పడిన కేసులో అతడిని అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.  ఈ కేసులో జగదీశ్‌ను ఇవాళ కోర్టులో హాజరుపర్చినట్లు వెల్లడించారు.

- Advertisement -

జగదీశ్‌ వేధింపులతో పంజాగుట్ట పరిధిలో నివాసం ఉంటున్న ఓ మహిళ (జూనియర్‌ అర్టిస్టు) గత నెల 29న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై  మహిల తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.

పోలీసులు తెలిపిన ప్రకారం.. “మహిళ గత నెల 27న ఓ వ్యక్తితో ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్‌ ఫొటోలు తీసి ఆ తర్వాత ఆమెను బెదిరించాడు. మనస్తాపానికి గురైన మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశ్‌ను ఇవాళ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాం. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయం ఉంది” అని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...