మాజీ మంత్రి ఛాంబర్ నుంచి ఫర్నిచర్ తరలింపు..!

-

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క మల్లు, మంత్రులుగా మొత్తం 11 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రికి సంబంధించిన ఛాంబర్ నుంచి కొందరూ ఫర్నిచర్ ను తరలించారు. దీంతో చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది.

రవీంద్ర భారత్ లో ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చాంబర్ నుంచి కొందరు ఫర్నిచర్ తీసుకెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. కొంతమంది వ్యక్తులు ఫర్నిచర్ ను తీసుకెళ్తుండగా ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఆ వ్యక్తులకు ఓయూ జేఏసీ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నిచర్ ను ఎలా తీసుకెళ్తారని జేఏసీ నాయకులు వారిని ప్రశ్నించారు. దీంతో వారు ఫర్నిచర్ ని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఈ ఘటనపై టీజీవో సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. తమ కార్యాలయంలో వినియోగించుకునేందుకు ఆ పర్నిచర్ ను తీసుకువెళ్లాలని అనుకున్నామని.. అయితే అది ప్రభుత్వానిది  అని తెలియడంతో ఆ ప్రయత్నం మానుకున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news