కేసీఆర్ కి సర్జరీ చేయనున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్

-

బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అర్థరాత్రి తన ఫామ్ హౌస్ లో ఉన్న బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయారు. దీంతో తన ఎడుమ కాలు తుంటి ఎముక విరిగినట్టు వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై పలువురు అడిగి తెలుసుకుంటున్నారు. తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు.  యశోధ ఆసుపత్రి వద్ద భద్రత పెంచాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.

ఇవాళ సాయంత్రం 4 :30 గంటలకు సోమాజిగూడ యశోద లో కేసీఆర్ సర్జరీ జరుగనుంది. కేసీఆర్ కు హిప్ సర్జరీ చేయనున్నారు కోరుట్ల BRS MLA సంజయ్. డాక్టర్ సంజయ్ ఆర్థోపెడిషియన్ కావడంతో కేసీఆర్ కి సర్జరీ చేయనున్నారు. ఇంతకు ముందు కూడా కేసీఆర్ ట్రీట్ మెంట్ నిర్వహించారు డాక్టర్ సంజయ్. కేసీఆర్ కి హిప్ సర్జరీ చేయడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ కూడా ఆసుపత్రి వద్దకు రాకూడదని హరీశ్ రావు, కేటీఆర్ సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news