సీఎం జగన్ తో సంబంధాలపై మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంద్ర కీలాధ్రిపై దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మొక్కు చెల్లించుకోవడానికి వచ్చానని..10ఏళ్లలో అభివృధి పేరుతో కెసిఆర్ అప్పులు చేశారని ఆగ్రహించారు. ధనిక తెలంగాణను కెసిఆర్ పదేళ్లలో పాలనలో 5లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6గ్యారెంటీ హామీలను అమలు చేస్తుంది…నాకు సీఎం జగన్ కు మధ్య వ్యక్తిగత సంబందాలు వేరు రాజకీయ సంబంధాలు వేరన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో విభజన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలు చల్లగా ఉండాలని కోరుకున్నానని..అన్న,తమ్ముళ్ళ మధిరిగా తెలుగు రాష్ట్రాల సమస్యను పరిష్కారం చేసుకుంటామని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.