7వేల మంది హమాస్​ మిలిటెంట్లను హతం చేసిన ఇజ్రాయెల్

-

ఇజ్రాయెల్-హమాస్ మధ్య పోరు మరింత భీకరంగా మారింది. కాల్పుల విరమణ తర్వాత ఇజ్రాయెల్ గాజాపై మరింత తీవ్రంగా విరుచుకుపడుతోంది. దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌ నగరం నుంచి ఈజిప్టు సరిహద్దుల్లోని రఫా నగరానికి వెళ్లే రహదారులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ బాంబు దాడులు చేసినట్లు హమాస్‌ మిలిటెంట్‌ సంస్థ తెలిపింది. మరోవైపు ఖాన్‌ యూనిస్‌ నగరం బాంబులు, కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. ఈ నగరంలోనూ సిటీ సెంటర్‌ను ఖాళీ చేయాలని అక్కడి పౌరులను ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. గాజాపై ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటి వరకు ఏడు వేల మంది హమాస్ మిలిటెంట్లు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

మరోవైపు గాజా జనాభా 23 లక్షల మందిలో 85 శాతం నిరాశ్రయులు అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయెల్‌పై అంతర్జాతీయ సమాజం ఒత్తిడి పెంచుతోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్‌కు అమెరికా నుంచి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తోంది. హమాస్‌ మిలిటెంట్‌ సంస్థను రూపుమాపే లక్ష్యాన్ని చేరుకునే వరకు ఇజ్రాయెల్‌కు అండగా నిలుస్తామని ఇప్పటికే అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news