ఎమ్మెల్యే కంటే రెట్టింపు అభివృద్ధి చేస్తా.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సారంగాపూర్ మండలం లో పర్యటించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో నేనంటే గౌరవం ఉంది నా మాట ఎవరు కాదనరు అని పేర్కొన్నారు. ఎన్నికలలో గెలుపు ఓటములు నాకు సహజం అని తెలిపారు.
ప్రజలు నాకు ఏ బాధ్యతలు అప్పగించిన ఆ హోదాలో నా బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. నేను ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే.. పెద్ద స్థాయిలో బాధ్యతలు వచ్చి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండలేకపోవచ్చు. కానీ జగిత్యాల నియోజకవర్గానికి అను నిత్యం, అందుబాటులో ఉండి, నా సేవలు అవసరమని దేవుడు నన్ను ఈ నియోజకవర్గానికే పరిమితం చేసాడు. ప్రభుత్వం లో నేను అంటే గౌరవం ఉంది, నా మాట ఎవరు కాదన్నారు. ఎమ్మెల్యే గా గెలుస్తే జగిత్యాల నియోజకవర్గాన్ని ఎంత అబివృద్ది చేస్తానో, అంతకు రెట్టింపు అబివృద్ది చేస్తానని స్పష్టం చేశారు జీవన్ రెడ్డి.