Roundup 2023 : ఈ ఏడాది కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఇవే.. మీ ఫేవరేట్‌ ఏది..?

-

2023 సంవత్సరం చివరికి వచ్చేసింది. అదేంటో ఈ సంవత్సరం త్వరగా అయిపోయింది కదా..! పోయిన ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం కాస్త పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఉద్యోగాల పరంగా ఇంకా కుదటపడలేదు కానీ.. మూవీస్‌ అయితే ఈ సంవత్సరం గట్టిగానే రిలీజ్‌ అయ్యాయి. ఒక్కసారి 2023లో టాలీవుడ్‌లో హెఎస్ట్‌ గ్రాస్‌ వచ్చిన సినిమాలు, రిలీజ్‌ అయిన పెద్ద సినిమాలు ఏంటో చూద్దామా..!

Highest worldwide gross of 2023

1. ఆదిపురుష్‌- ₹353–450 crore (US$44–56 million)
2. వాల్తేరు వీరయ్య- ₹236.15 crore (US$30 million)
3. వీర సింహారెడ్డి- ₹133 crore (US$17 million)
4. సార్‌- ₹118 crore (US$15 million)
5. దసరా- ₹117.15 crore (US$15 million)
6. బ్రో- ₹115.50 crore (US$14 million)
7. భగంవత్‌ కేసరి- ₹100−114.4 crore (US$−14 million)
8. విరూపాక్ష- ₹91 crore (US$11 million)
9. బేబీ- 80.01 crore (US$10 million)
10. ఖుషి- ₹71.95 crore (US$9.0 million)

వీటితో పాటు తమిళ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజన్‌ తీసిన లియో కూడా బాక్సాఫీస్‌ వద్ద కలక్షన్ల వర్షం కురిపించింది. వరల్డ్‌ వైడ్‌గా రూ. 612 కోట్లు వచ్చింది.

అట్లీ డైరక్షన్‌లో వచ్చిన జవాన్‌ సినిమా కూడా 1160 కోట్లు వచ్చింది. షారుఖాన్‌కు ఇదే సంవత్సరంలో రెండు సినిమాలు వెయ్యి కోట్లు దాటాయి. పతాన్‌ సినిమాకు 1055 కోట్ల కలక్షన్స్‌ వచ్చాయి.

సూపర్ స్టార్‌ రజినీకాంత్‌ మూవీ జైలర్‌ కూడా ఇదే సంవత్సరంలో రిలీజ్‌ అయింది. తమిళ్‌ డైరెక్టర్‌ నెల్సన్‌ తీసిన ఈ సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా రూ. 610 కోట్లకు పైగా కలెక్షన్స్‌ వచ్చాయి.

ఆగస్టులో వచ్చిన గద్దర్‌ 2 సినిమాకు వరల్డ్‌ వైడ్‌గా రూ. 686 కోట్లు వచ్చాయి.

వీటన్నికంటే.. వీలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన బలగం సినిమా ఈ సంవత్సరం సంచలనం సృష్టించింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు రూ. 26.72 కోట్ల కలెక్షన్స్‌ వచ్చాయి. చిన్న సినిమాలు సైతం ఇంత రేంజ్‌లో ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వగలవని బలగం సినిమా నిరూపించంది. తెలంగాణ వ్యాప్తంగా పల్లెటూర్లలో ఈ సినిమాను ప్రొజెక్టర్ల ద్వారా వేసి చూపించారు. ఎన్నో ఏళ్లగా చిన్న చిన్న గొడవలతో విడిపోయిన ఎంతో మందిని బలగం సినిమా కలిపింది.

డిసెంబర్‌ 1న రిలీజ్‌ అయిన యానిమల్‌ సినిమా ఇంకా థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తుంది. 3 గంటల 21 నిమిషాలు ఎక్కడా బోర్‌ కొట్టకుండా చేసిన సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌ అదిరిపోయింది. రూ. 200 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు ఇప్పటి వరకూ వరల్డ్‌ వైడ్‌గా రూ. 717 కోట్ల కలక్షన్స్‌ వచ్చాయి. ఈ సంవత్సరంలో హైఎస్ట్‌ గ్రాస్‌ వచ్చిన మూడో సినిమాగా యానిమాల్‌ మూవీ రికార్డుకు ఎక్కింది. ఇంకో రెండు వందల కోట్ల కలక్షన్స్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది.

ఇకపోతే.. సలార్‌ మూవీ ఈ నెల 22న రిలీజ్‌ కానుంది. ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఆదిపురుష్‌ తర్వాత ప్రభాస్‌ తీస్తున్న సినిమా ఇదే. కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ డైరక్షన్స్‌లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. 400 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా ఎన్ని కోట్ల కలక్షన్స్‌ రాబట్టబోతుందో చూడాలి.

ఈ నెల 21న రిలీజ్‌ కానున్న ఢంకీ సినిమా కూడా ఈ ఏడాది పెద్ద సినిమా జాబితాలో ఉంది. రూ. 120 కోట్ల బడ్జెట్‌తో రాజ్‌కుమార్‌ హిరానీ డైరెక్షన్‌లో షారుఖాన్ హీరోగా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు వెయ్యికోట్ల కలక్షన్స్‌ వచ్చాయంటే.. సినిమా చరిత్రలోనే వరుసగా ఒకే ఏడాది మూడు సినిమాలకు వెయ్యికోట్లు కలక్షన్స్‌ వచ్చిన హీరోగా షారుఖాన్‌ పేరు నిలిచిపోతుంది. అయితే సలార్‌ కూడా ఇదే టైమ్‌లో రిలీజ్‌ అవడంతో కలక్షన్స్‌ విషయంలో అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది.

వీటిల్లో మీ ఫేవరెట్‌ సినిమా ఏది.. ఇంకా మేం మిస్‌ అయిన మూవీస్‌ ఏంటో కమెంట్‌ చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news