మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కాసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ డిశ్చార్జ్ అనంతరం… తన సొంత వాహనాల్లో నంది నగర్ లోని నివాసానికి తీసుకెళ్తున్నారు. గురువారం మధ్యరాత్రి ఒంటగంటన్నర సమయం లో ఫామ్ హౌస్ లో కాలుజారీ కింద పడటంతో తుంటి ఎముక మల్టిపుల్ ఫ్రాక్చర్ అవడంతో… పూర్తిగా హిప్ రీప్లేస్మెంట్ నిర్వహించారు.
శుక్రవారం సాయంత్రం 4గంటల కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ నిర్వహించారు. శనివారం ఉదయం డాక్టర్ల పర్యవేక్షణ లో కెసిఆర్ ను నడిపించడం జరిగింది. 7 రోజుల పాటు యశోద ఆస్పత్రి లో ట్రీట్మెంట్ లో ఉన్న కెసిఆర్… ఇవ్వాళ డిశ్చార్జ్ అయ్యారు. కెసిఆర్ పూర్తిగా కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుంది అని వైద్యులు తెలిపారు. ఇప్పటికే డిశ్చార్జ్ ప్రక్రియ పూర్తి చేసి వేద పండితుల పూజల అనంతరం…ఆయనను నందినగర్ కు తీసుకెళ్లారు.