ఓవర్సీస్లో ‘సలార్’ మేనియా- అడ్వాన్స్ బుకింగ్స్లో జోరు మామూలుగా లేదుగా

-

వరుస ఫ్లాప్లతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో రానున్న భారీ బడ్జెట్ సినిమాలు ప్రభాస్కు హిట్నిస్తాయా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ 22న విడుదలకు రెడీగా ఉంది. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్కు భారీ స్పందన లభిస్తోంది.

SalaarReleaseTrailer

అయితే రిలీజ్కు ముందే సలార్ రికార్డులు బద్దలుకొడుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్లో జోరు సాగిస్తోంది. ‘సలార్’ టికెట్లు హాట్కేకుల్లా అమ్మడుపోతున్నాయి. ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్లో ఈ మూవీకి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆడ్వాన్స్ బుకింగ్స్లో ‘సలార్’ రూ.21 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఇంకా కొన్ని దేశాల్లో బుకింగ్స్ ఓపెన్ కావాల్సి ఉంది.

మరోవైపు ‘సలార్’ సినిమా బుకింగ్స్ ఉత్తరాదిలో ఆదివారం ప్రారంభమయ్యాయి. హిందీలో 15 వేల టికెట్లు, ఇతర భాషల్లో 10 వేలకు పైగా టికెట్లకు పైగా అమ్ముడుపోయాయని టాక్. పీవీఆర్, ఐనాక్స్లో స్క్రీన్లలోనే దాదాపు 25 వేల టికెట్లు బుక్ అయ్యాయట. దీని ద్వారా రూ.5 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ రూ.4.29 కోట్ల మేర ఉన్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news