కార్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. డ్రైవర్ లెస్ కార్లను భారత్‌లోకి అనుమతించబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డ్రైవర్‌లెస్ కార్ల వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అది ఎప్పటికీ జరగనివ్వలమన్నారు.
భారత్‌లో టెస్లా అమ్మకాలు చేపట్టేందుకు అనుమతిస్తాం.. కానీ చైనాలో కార్లను తయారు చేసి, భారత్‌లో విక్రయించేందుకు అంగీకరించమన్నారు. భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్ ప్రాముఖ్యతను తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు అధునాతన టెక్నాలజీని ఎప్పుడూ స్వీకరిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.