జ్ఞానవాపి కేసులో అలహాబాద్‌ హైకోర్టు కీలక ఆదేశాలు

-

జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మసీదు స్థానంలో గతంలో ఉన్న ఆలయాన్ని పునరుద్దరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌ కొట్టివేయాలని దాఖలు చేసిన 5 పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. 1991లో వారణాసి కోర్టులో దాఖలైన పిటిషన్‌ అనుమతించ తగినదే అని జస్టిస్‌ రోహిత్ రంజన్‌ అగర్వాల్ తీర్పు వెలువరించారు. వారణాసి కోర్టులో ఉన్న పిటిషన్‌ను ప్రార్థనా స్థలాల చట్టం-1991 నిరోధించలేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఈ మసీదు ఒకప్పుడు కాశీ విశ్వనాథ్‌ ఆలయంలో భాగమేనని అక్కడ మసీదు నిర్మించారని కాబట్టి మళ్లీ ఆలయం పునరుద్దరించాలని.. హిందువులు వారణాసి కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన వారణాసి కోర్టు..2021 ఏప్రిల్‌ 8వ తేదీన జ్ఞానవాపి మసీదులో సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ బాధ్యతలు చూస్తున్న అంజుమన్‌ ఇంతేజామియా మస్జిద్‌ కమిటీ-ఏఐఎంసీ, ఉత్తర్ ప్రదేశ్‌ సున్నీ సెంటర్ల్ వక్ఫ బోర్డ్‌ హైకోర్టులో 5 పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లపై తాజాగా విచారణ చేపట్టిన అలాహాబాద్‌ హైకోర్టు వాటిని కొట్టివేసింది. అనంతరం ఈ కేసుకు సంబంధించిన విచారణను ఆరునెలల్లోగా పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news