అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లకు కిమ్ వార్నింగ్

-

అమెరికా, దక్షిణ కొరియా, జపాన్లకు ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ దేశాల నేతృత్వంలో సైనిక బెదిరింపులకు మరిన్ని ప్రతి చర్యలు చేపడతామని హెచ్చరించారు. అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకేలా రూపొందించిన ఆధునిక ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని కిమ్‌ జోంగ్ ఉన్ వీక్షించారు.

సోమవారం రోజున వసూంగ్-18 ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని కూతురుతో కలిసి వీక్షించిన కిమ్‌ అమెరికా కనుక తమ విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఉత్తర కొరియా ఎలా స్పందిస్తుందో ఈ క్షిపణి చెబుతోందని అన్నారు. బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా అమెరికా నేతృత్వంలోని..సైనిక కూటమి చేస్తున్న బెదిరింపులను తాను తేలిగ్గా తీసుకోనని కిమ్ చెప్పినట్లు ఆ దేశ అధికారిక వార్తా ఛానల్ పేర్కొంది.

వసూంగ్‌-18 ఖండాంతర క్షిపణిని ఉత్తర కొరియా అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ఆయుధంగా భావిస్తున్నారు. ఈ క్షిపణి అమెరికా భూ భాగాన్ని చేరుతుందని చెప్పేందుకు ఉత్తర కొరియా మరింత నిరూపణ చేసుకోవాల్సి ఉంటుందని పశ్చిమ దేశాల నిపుణులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news