ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు

-

మరో రెండ్రోజుల్లో క్రిస్మస్ వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ సంబురాలు షురూ అయ్యాయి. మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. విద్యుద్దీపాలతో చర్చ్లన్నీ వెలుగులీనుతున్నాయి. మరోవైపు ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఇవాళ ‘క్రిస్మస్‌ వేడుకలు’ నిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు.

క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఈరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. ఏఆర్‌ పెట్రోల్‌బంక్‌ కూడలి నుంచి బషీర్‌బాగ్‌ బీజేఆర్‌ విగ్రహం కూడలి వైపు ట్రాఫిక్‌ను అనుమతించమని వెల్లడించారు. నాంపల్లి లేదా రవీంద్రభారతి వైపు పంపిస్తారమని చెప్పారు. మరోవైపు సికింద్రాబాద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం ‘ఎట్‌ హోమ్‌’ కార్యక్రమం దృష్ట్యా ట్రాఫిక్‌ మళ్లింపులుంటాయని ట్రాఫిక్‌ పోలీసు అధికారులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news