నారా లోకేష్ అరెస్ట్ కు రంగం సిద్ధం అయ్యిందా ? ఏ క్షణమైనా నారా లోకేష్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. నారా లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వండి అని ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సెక్షన్ 41ఏ నోటీసులోని షరతులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది.
రెడ్ బుక్ పేరుతో పోలీసులను, సాక్షులను బెదిరించారని…న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా పలు ఆరోపణలు చేశారని ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. నేరుగా అరెస్టు చేయవచ్చుగా అని సీఐడీని ప్రశ్నించింది కోర్టు. కోర్టు అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశామని సీఐడీ వెల్లడించింది.
అయితే నారా లోకేశ్ ఇంటర్వ్యూలను చూసిన తర్వాత స్పందిస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా పడింది. హై కోర్టులోనూ మెమో దాఖలు చేసింది సీఐడీ.