30 న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ …. మరో ఆరు వందే భారత్ లు… !

-

వందే భారత్ రైలు తరహాలోని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను డిసెంబర్ 30వ తేదీ న అయోధ్య వేదికగా ప్రధాన నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశం ఉంది. మొదటగా రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ పట్టాలెక్కీస్తుండగా….. తర్వాత మరో ఆరు ట్రైన్స్ ప్రారంభిస్తామని తెలిపారు. దీనిపై pm ఆఫీస్ నుంచి సమాచారం రావాల్సి ఉంది. అలాగే అయోధ్య లో నిర్మించిన విమానాశ్రయాన్ని ఈనెల 30వ తేదీని ప్రారంబించనున్నారు.

ఈ ట్రైన్స్ లో ఒకటి ఢిల్లీ నుంచి దర్భంగా వరకు ప్రయాణిస్తు ఉండగా మరో ట్రైను మాల్దా నుంచి బెంగళూరు మధ్య సేవలను అందించబోతున్నట్లు సమాచారం. మరో ఆరు అమృత్ భారత్ ట్రైన్స్ అయోధ్య- ఆనంద్ విహార్ (దిల్లీ), వైష్ణోదేవి- దిల్లీ, జాల్నా- ముంబయి, కోయంబతూ బెంగళూరు, అమృత్సర్ – దిల్లీ, మంగళూరు – సెంట్రల్ – మడ్గావ్ మధ్య అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రైన్స్ గరిష్టంగా గంటకి 130 మైళ్ల వేగంతో ప్రయాణిస్తాయి

.

Read more RELATED
Recommended to you

Latest news