రూ.500కు గ్యాస్ సిలిండర్.. లబ్ధిదారుల ఎంపికపై పౌరసరఫరాల శాఖ ప్రతిపాదనలు

-

మహాలక్ష్మి పథకంలో భాగమైన 500కే గ్యాస్‌ సిలిండర్‌ పంపిణీకి పౌరసరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. రాష్ట్రంలో రేషన్‌ కార్డు ఉన్నవారినే ఈ పథకంలో లబ్ధిదారుగా ఎంపిక చేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్‌ తీసుకోవాలనే నిబంధన ప్రతిపాదించినట్లు సమాచారం.

gas cylinder prices

ఈ పథకానికి రేషన్‌ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. రేషన్‌ కార్డులతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన ఉన్నాకీ అది కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. రాయితీ సిలిండర్లను సంవత్సరానికి ఆరు లేక పన్నెండు ఇవ్వాలా? అనే విషయంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హుల కుటుంబంలోని సభ్యుల సంఖ్య, గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య.. వంటి అంశాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. కొత్త కార్డులు పొందే వారికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తారని చెబుతున్నారు. కొత్త గ్యాస్‌ కనెక్షన్లను పరిగణనలోకి తీసుకోవద్దని పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం..

Read more RELATED
Recommended to you

Latest news