కోలీవుడ్ లెజెండ్ మరణం బాధాకరం.. విజయ్ కాంత్ మృతిపై ప్రధాని సంతాపం

-

ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎంకే అధినేత విజయ్ కాంత్ కన్నుమూశారు. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం మరణించారు. ఆయన మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కాంత్తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. విజయ్ కాంత్ మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయ్ కాంత్ మరణంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఆయన మరణించడం చాలా బాధాకర విషయమని విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పోస్టు చేసిన మోదీ విజయ్ కాంత్తో దిగిన ఫొటోలను షేర్ చేశారు. “విజయకాంత్‌ మరణం బాధాకరం. తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఆయనో లెజెండ్‌. తన నటనతో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేశారు. నాకు మంచి మిత్రుడు. ఆయన లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆయన కుటుంబానికి, అభిమానులకు, అనుచరులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి” అని మోదీ సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news