కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు.. నారాయణ రియాక్షన్ ఇదే

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీపీఐ మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి హస్తం పార్టీ కేటాయించింది. ఆ స్థానంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఎన్నికల వరకు కలిసి మెలిసి ఉన్న ఈ ఇరు పార్టీల్లో ఇప్పుడు అభిప్రాయబేధాలు వచ్చాయట.

ఇటీవలే రాష్ట్రంలో సింగరేణి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు వచ్చిందనే పుకార్లు మొదలయ్యాయి. ఇక ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కార్మికుల ఎన్నికలకు రాజకీయాలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుష్ట సంప్రదాయానికి తెరలేపిందని అన్నారు. ఎన్నికల వేళ కార్మికులను ప్రలోభాలకు గురిచేశారని మండిపడ్డారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ అధికారంలోకి రావడం సంతోషంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news