ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను వరంగల్ లోక్ సభ స్థానం నుంచి బరిలో దించాలని బీజెపీ యోచిస్తున్నట్లు సమాచారం. తద్వారా తెలంగాణ రాష్ట్రంలోని మాదిగల ఓటు బ్యాంకును దక్కించుకోవచ్చని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని బీజెపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మాజీ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్, బీజెపీ సీనియర్ నేత చింతా సాంబమూర్తి వరంగల్ టికెట్ ఆశిస్తుండటం గమనార్హం.