జగన్ కీలక నిర్ణయం….నేడు YCP ‘చలో మెడికల్‌ కాలేజీ’ కార్యక్రమం

-

వైఎస్ జ‌గ‌న్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. వైయస్సార్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ నిర్వ‌హించేందుకు ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జ‌రుగ‌నుంది. తమ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన 10 కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రైవేటీకరించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇవాళ‌ ‘ఛలో మెడికల్‌ కాలేజీ’ చేపడుతున్నట్లు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పార్టీ వెల్లడించింది.

jagan
jagan

ఆ రోజున ఆయా కాలేజీల వద్దకు వెళ్లే పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు అన్ని వాస్తవాలను ప్రజలకు వివరిస్తారని పార్టీ తెలియజేసింది. శాంతియుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని పార్టీ తెలిపింది. ఈ మేరకు వైయస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఒక ప్రకటన చేస్తూ.. పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ‘ఛలో మెడికల్‌ కాలేజీ’లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news