టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ గత నెల లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. జట్టు యజమాన్యం తొలి నాలుగు మ్యాచ్లలో తీసుకోలేదు. అయితే హార్థిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకి దూరమవ్వడంతో అతని స్థానంలో షమీ ని తీసుకున్నారు. కేవలం 7 మ్యాచ్ లలో 24 వికెట్లు పడగొట్టాడు. సెమీస్ లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్లతో చెలరేగిపోయారు. రెండుసార్లు ఐదు వికెట్ల లను తీసుకున్నాడు.
షమీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చీలమండ గాయంతో బాధ పడుతూ ఉండడంతో షమీ ఇంజక్షన్స్ తీసుకున్నాడని అతని యొక్క మిత్రుడు తెలిపారు. వయసు పెరుగుతున్న కొద్దీ గాయాలు త్వరగా నయం కావాలంటే ఎక్కువ రోజులు సమయం పడుతుంది. దీంతో షమీ రోజు ఇంజక్షన్స్ తీసుకునేవాడని అతను పేర్కొన్నాడు.
అయితే షమీని దక్షిణాఫ్రికా తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి బీసీసీఐ సెలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గాయం నుండి ఇంకా కోల్పోకపోవడంతో అతడి స్థానంలో రెండవ టెస్ట్ కి ఆవేశ్ ఖాన్ బీసీసీఐ ఎంపిక చేసింది.