సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద మిస్సింగ్ అంటూ ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్గు జారీ చేసింది. 2019 లోక్ సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 లోక్ సభ ఎన్నికల్లో జయప్రద బీజేపీ తరపున రాంపూర్ నుంచి బరిలో నిలిచారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత ఆమె ఓ రోడ్డును ప్రారంభించడంతో స్వార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
ఇప్పటికీ ఈ కేసు కోర్టులో నడుస్తోంది. విచారణకు హాజరు కావాలని పలుమార్లు జడ్జీ ఆదేశించినా ఆమె హాజరు కాలేదు. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసు నవంబర్ 08న విచారణకు వచ్చింది. జయప్రద హాజరుకాకపోవడంతో నవంబర్ 17కి వాయిదా వేశారు. అప్పటికే జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. నవంబర్ 17న ఆమె కోర్టుకు రాకపోయే సరికి డిసెంబర్ కి వాయిదా వేశారు. ఇన్నిసార్లు కోర్టు సమయాన్ని వృధా చేయడంతో ఆమెపై కోర్టు ఫైర్ అయిది. జనవరి 10లోపు జయప్రదను తీసుకురావాల్సిందిగా పోలీసులకు అజ్ఞాపించింది. కోర్టు వారి ఆదేశంతో పోలీసులు వెంటనే ఆమె నివాసం వద్దకు వెళ్లగా.. అక్కడ ఆమె కనిపించడం లేదు. ఇప్పటివరకు ఆమె ఆచూకి ఎవ్వరికీ తెలియరాలేదు. జయప్రద ఎక్కడ ఉంది అనేది మిస్టరీగా మారింది.