నా కుమారుడిని ఆశీర్వదించండి.. వైఎస్ షర్మిల ట్వీట్

-

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆమె తనయుడు వైఎస్ రాజారెడ్డి త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారు. ఇప్పటికే పెళ్లి పనులు కూడా షురూ అయ్యాయి. తాజాగా నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ శుభవార్తను షర్మిల తన అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విటర్) వేదికగా ఈ గుడ్ న్యూస్ను షేర్ చేశారు.

“అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజా రెడ్డికి, ప్రియమైన అట్లూరి ప్రియాతో జనవరి నెల 18వ తేదీన నిశ్చితార్థం వేడుక , ఫిబ్రవరి 17వ తేదీన 2024 వివాహ వేడుక జరగనుంది. ఈ విషయం మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. రేపు (జనవరి 2వ తేదీన) మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శించి తొలి ఆహ్వాన పత్రిక ఘాట్ వద్ద ఉంచి, నాన్న ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడానికి సంతోషంగా ఉంది.” అంటూ వైఎస్ షర్మిల ట్వీట్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news