తిరుచిరాపల్లి ఎయిర్‌పోర్ట్ కొత్త టెర్మినల్ చూశారా?

-

PM MODI : ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 1,100 కోట్లతో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్ భవనం ఆధ్యాత్మికంగా రూపుదిద్దుకుంది. అనేక కళాకృతులతోపాటు శ్రీరంగం ఆలయ గోపురాన్ని పోలిన నిర్మాణాన్ని విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Have you seen Tiruchirappalli Airport’s new terminal

కాగా, నేటి నుంచి దక్షిణాదిలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో రూ. 19,850 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. దీంతోపాటు లక్షద్వీప్, కేరళలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news