నేటి నుంచి దక్షిణాదిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

-

PM MODI : నేటి నుంచి దక్షిణాదిలో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ప్రధాని మోదీ నేటి నుంచి రెండు రోజులపాటు తమిళనాడు, లక్షద్వీప్, కేరళలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో రూ. 19,850 కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

Muzaffarpur: Prime Minister Narendra Modi addresses during a BJP rally in Bihar’s Muzaffarpur on April 30, 2019. (Photo: IANS)

తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. దీంతోపాటు లక్షద్వీప్, కేరళలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు ఉన్నతాధికారులు.

ఇక ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా తిరుచిరాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ను ప్రారంభించనున్నారు. దాదాపు రూ. 1,100 కోట్లతో నిర్మించిన ఈ కొత్త టెర్మినల్ భవనం ఆధ్యాత్మికంగా రూపుదిద్దుకుంది. అనేక కళాకృతులతోపాటు శ్రీరంగం ఆలయ గోపురాన్ని పోలిన నిర్మాణాన్ని విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news