మాటలు కాదు.. చేతలు చూపించాలనే నిబద్ధతతో పని చేస్తున్నాం : మంత్రి పొంగులేటి

-

మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతతో పని చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలో 6 హామీలకు ఆమోదం తెలిపిందన్నారు. తమ ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామన్నారు. ఖమ్మం రూరల్ మండలం మంగళదూడెంలో జరిగిన ప్రజాపాలన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ కవరేజీని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు 16 గంటల పాటు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వెల్లడించారు.


మరోవైపు ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి స్టేజి వద్ద రెండు బైక్ లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. సహాయం కోసం ఎదురుచూస్తూ.. రోడ్డుపై ఉండిపోయారు. ప్రమాదాన్ని అటుగా వెళుతున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గమనించారు. వెంటనే రోడ్డు పక్కన ఆపారు. ధైర్యంగా ఉండాలని ఏమీ కాదని వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాత ఆంబులెన్స్ కు ఫోన్ చేసి ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి క్షతగాత్రులను భయపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా ఉండాలని సూచించారు. అక్కడ తమ వ్యక్తులు ఉంటారని, ఏమైనా అవసరం ఉంటే తనకు ఫోన్ చేయాలని అన్నారు. అయితే మంత్రి పొంగులేటిది పెద్ద మనసు అని ఆయన అనుచరులు, అభిమానులు అంటున్నారు. కష్టం వస్తే అన్నీ పక్కన పెట్టి ముందుంటారు. ఎలాంటి ఆపద వచ్చినా తక్షణమే స్పందిస్తారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news