దేశంలో 511 జేఎన్‌.1 కేసులు.. కర్ణాటకలో అధికం

-

కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. భారత్లో ఈ వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్త వేరియంట్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. భారత్లో కొవిడ్‌-19 కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 511కు చేరుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 199 మంది దీని బారిన పడ్డారని తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో 148 కేసులతో కేరళ ఉందని పేర్కొంది.

గోవాలో 47 మంది జేఎన్1 వేరియంట్ బారిన పడగా.. గుజరాత్లో 36 మంది, మహారాష్ట్ర (32), తమిళనాడు (26), దిల్లీ (15), రాజస్థాన్‌ (4), తెలంగాణ (2), ఒడిశా (1), హరియాణా ఒక్కరు కొత్త వేరియంట్ జేఎన్1 బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలంతా కొత్త వేరియంట్తో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నందు వల్ల మాస్కులు తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. స్వచ్ఛందంగా కరోనా నిబంధనలు పాటిస్తే ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవచ్చని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news