హాస్యబ్రహ్మ, టాలీవుడ్ నవ్వుల ‘రారాజు’ బ్రహ్మానందం తన జీవితకథను రాశారు. ‘నేను-మీ బ్రహ్మానందమ్’ అనే పేరుతో ఆ పుస్తకాన్ని ప్రచురించారు. ఇటీవలే బ్రహ్మి ఆటో బయోగ్రఫీ కాపీని మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. నాలుగు దశాబ్దాల తన సినీ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలు, నేర్చుకున్న పాఠాలు, కలిసిన వ్యక్తులు, తెలుసుకున్న విషయాలు ఇలా అన్నింటి గురించి బ్రహ్మానందం తన ఆత్మకథను రాసుకున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మి తన బయోపిక్లోని కొన్ని ముఖ్య అంశాలను ప్రస్తావించారు. అవేంటంటే..?
తన జీవితం నుంచి వచ్చింది కావడంతో తన ఆత్మకథకి ‘నేను…మీ బ్రహ్మానందమ్’ అని పేరు పెట్టినట్లు బ్రహ్మానందం తెలిపారు.
ఇంచుమించు 70 ఏళ్లు వెనక్కి వెళ్లి ఈ ఆత్మకథను రాశారట బ్రహ్మి
ఈ బయోపిక్ రాయడం మొదలుపెట్టాక పూర్తవ్వడానికి రెండేళ్ల సమయం పట్టిందట
తన జీవితం నుంచి తర్వాత తరం ఏం తెలుసుకుంటుంది? వాళ్లకి ఎలా ఉపయోగపడుతుందనే కోణంలోనే ఆలోచించి రాశారట
సంజయ్ కిశోర్ అనే రచయిత బ్రహ్మానందం ఫొటో బయోగ్రఫీ అని ఒక పుస్తకాన్ని రాస్తున్నారట. అందులో బ్రహ్మీ వేసిన బొమ్మలు, చిత్రలేఖనం అభిరుచి ప్రస్తావన కూడా ఉంటుందట