ఓటీటీ లోకి వస్తున్న నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్… స్ట్రీమింగ్ ఎక్కడంటే…?

-

టాలీవుడ్ కింగ్ హీరో నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల అయింది. కానీ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా పరాజయాన్ని మూటకట్టుకుంది. వక్కంతం వంశీ మంచి రైటర్ కానీ దర్శకత్వంలో తన ప్రతిభను చాటలేక పోయాడు. ఈ సినిమాకి పోటీగా నాని హీరోగా నటించిన హాయ్ నాన్న మూవీ కూడా విడుదల అయి మంచి పాజిటివ్ టాక్ రావడంతో నితిన్ సినిమా థియేటర్లలో ఎక్కువ రోజులు నిలువలేకపోయింది.

అయితే ఈ చిత్రంను సంక్రాంతి కానుకగా ఓటిటీ లో విడుదల చేయుటకు మేకర్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ చిత్రం ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఈ సినిమాను జనవరి 13 నుంచి 16 వ తేదీ మధ్య ఓటిపి ఫ్లాట్ ఫామ్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. కానీ మేకర్స్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అధికారిక ప్రకటన వస్తే గాని ఈ సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news