ఆట కంటే తన సొంత టీం ప్లేయర్స్ పైన, ప్రత్యర్థుల పైన ఆటిట్యూడ్ చూపించే అస్సాం యువ క్రికెటర్ రియాన్ పరాగ్.. దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌తో ముగిసిన మ్యాచ్‌లో అస్సాం తరఫున 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు . ఈ సెంచరీ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హండ్రెడ్ చేసిన ఇండియా ప్లేయర్స్ లో 4 వ స్థానంలో నిలిచాడు. ఇంతకుముందు ఈ జాబితాలో శక్తి సింగ్ (45 బంతులలో), రిషభ్ పంత్ (48 బంతులు), యూసుఫ్ పఠాన్ (51 బంతులు)లు వరుసగా మొదటి మూడు స్థానాలలో ఉన్నారు.అస్సాం కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రియాన్ పరాగ్ 87 బంతుల్లోనే 11 ఫోర్లు, 12 భారీ సిక్సర్ల సాయంతో 155 రన్స్ రాబట్టాడు. 56 బంతుల్లో సెంచరీ చేసిన రియాన్ పరాగ్ విండీస్ దిగ్గజం వివిన్ రిచర్డ్స్ రికార్డును సమం చేశాడు.
1987-88 రంజీ సీజన్‌లో అస్సాంకే చెందిన ఆర్‌కె బోరా 56 బంతుల్లోనే సెంచరీ సాధించాడు . అయితే ఈ మ్యాచ్లో పరాగ్ సెంచరీ సాధించినప్పటికీ అస్సాం మాత్రం ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.87 పరుగుల లక్ష్య చేదనలో ఛత్తీస్‌గఢ్ వికెట్ కోల్పోకుండా విజయాన్ని అందుకుంది.