Praja Palana Applications : ప్రజా పాలన అప్లికేషన్లు రోడ్ల పాలు!

-

Praja Palana Applications : 5 గ్యారెంటీల కోసం అప్లై చేసిన అభయహస్తం దరఖాస్తు పత్రాలు రోడ్డుపై దర్శనం ఇచ్చాయి. నిన్న హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్ పై బైక్ పై నుంచి ఫామ్స్ ఎగిరి చిందరవందరగా పడిపోయాయి. ఎవరో రాపిడో బుక్ చేస్తే తాను తీసుకెళ్తున్నానని సదరు బైకర్ తెలిపారు. దాదాపు 500 ఫామ్స్ ఉన్నాయి. ఈ దరఖాస్తులు హయత్ నగర్ పరిధిలోనివి అని గుర్తించారు. డేటా ఎంట్రీ కోసం తీసుకెళ్తున్నట్లు సమాచారం.

Praja Palana Applications :

కాగా, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జరిగిన పది రోజుల్లో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయితీలు, 3,623 మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన సభలను నిర్వహించగా, ఈ గ్రామ సభల్లో 1,11,46,293 మంది పాల్గొన్నారు. ఈ ప్రజాపాలనలో మొత్తం 3,714 అధికార బృందాలు పాల్గొనగా దరఖాస్తుల స్వీకరణకు 44,568 కౌంటర్లను ఏర్పాటు చేశారు.

https://x.com/TeluguScribe/status/1744534989352607799?s=20

Read more RELATED
Recommended to you

Latest news