కుమార్తెల పిల్లలకూ తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుందంటూ సంచలన తీర్పు ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. కుమార్తెలు మరణించినప్పటికీ తండ్రి ఆస్తులు వారి పిల్లలకు హక్కు ఉంటుందని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది.
తోబుట్టువులు చనిపోయినందున వారి పిల్లలకు వాటా ఎందుకు ఇవ్వాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. ‘తండ్రి ఆస్తిలో హక్కు కుమార్తె, కొడుకుకు పుట్టుకతోనే వస్తుంది. కుమారుడు చనిపోయాక వారి వారసులకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుంది. ఇదే న్యాయసూత్రం కుమార్తెల పిల్లలకు వర్తిస్తుంది’ అని పేర్కొంది.