డేంజర్‌ బెల్స్‌.. బోయింగ్‌ విమానాల్లో లూజ్‌ బోల్ట్‌ల గుర్తింపు

-

బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో భయపెట్టిన ఈ విమానాలు.. ఇప్పుడు సాంకేతిక సమస్యలతో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికాలోని యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ తమ బోయింగ్‌ విమానాల్లో తనిఖీలు చేపట్టగా.. 10 విమానాల్లో బోల్టులు వదులుగా ఉన్నట్లు సమాచారం.

అమెరికాలో 737 మ్యాక్స్‌ మోడల్‌ వాడుతున్న రెండు సంస్థల్లో ఇది కూడా ఒకటి. తమ విమానాల్లో తనిఖీ చేస్తున్నప్పుడు డోర్‌ ప్లగ్‌లు బిగించే సమయంలో తలెత్తిన సమస్యలు ఇంకా ఉన్నట్లు గుర్తించామని ఆ ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అలాస్కా ఎయిర్‌లైన్స్‌ తనిఖీల్లోనూ ఇలాంటి లోపాలను గుర్తించినట్లు సమాచారం. ఈ ఎయిర్‌లైన్స్‌ ప్రకటనతో 737 మ్యాక్స్‌పై ఆందోళనలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో తనిఖీలపై మార్గదర్శకాలను తయారు చేసేందుకు బోయింగ్‌-అమెరికా ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయి.

737మ్యాక్స్‌ విమానాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ను రీప్లేస్‌ చేసేందుకు వీలుగా డోర్‌ప్లగ్‌ ప్యానళ్లను అమర్చుతున్నారు.  విమానంలో అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు కేవలం 90 సెకన్లలో వందల మంది ప్రయాణికులను కిందకు దించేందుకు డోర్‌ప్లగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news