ఉప్పల్‌లో భార‌త్-ఇంగ్లాండ్ మ్యాచ్‌ చూసేందుకు ఫ్రీ ఎంట్రీ..!

-

ఉప్పల్‌లో భార‌త్-ఇంగ్లాండ్ మ్యాచ్‌ చూసేందుకు ఫ్రీ ఎంట్రీ ఆఫర్‌ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశంలో ఇంగ్లాండ్ తో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో టాప్-2లో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే టీమిండియాకు ఇంగ్లాండుతో జరిగే టెస్ట్ సిరీస్ ఎంతో కీలకం. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ తొలి టెస్ట్ ఆడనుంది.

HCA invites school students to watch India-England Test for free at Uppal Stadium
HCA invites school students to watch India-England Test for free at Uppal Stadium

అయితే విద్యార్థులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ శుభవార్త తెలిపింది. తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజనం కూడా అందిస్తామని ప్రకటించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు ఈ మ్యాచ్ కు రావచ్చని వెల్లడించింది. అయితే దీనికోసం పాఠశాలల ప్రిన్సిపల్స్ తమ స్కూల్ నుంచి ఎంతమంది విద్యార్థులు, సిబ్బంది వస్తున్నారో ముందుగా తెలియజేయాలి. జనవరి 18వ తేదీలోపు హెచ్సీఏ సీఈఓకు [email protected] కు మెయిల్ చేయాలి. ఐదు రోజుల పాటు ఫ్రీ ఎంట్రీతో పాటు భోజన సదుపాయం ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news