గుంటూరు ఫ్యాన్స్ కోసం సూపర్ స్టార్ పోస్ట్..!

-

మహేష్ బాబు హీరోగా సంక్రాంతికి గుంటూరు కారం సినిమా వస్తోంది ఈ సినిమా కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ విపరీతంగా ఎదురు చూస్తున్నారు. మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో మూడవ సినిమా ఇది. జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి పైగా హిట్ అవుతుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు అయితే గుంటూరు ఫ్యాన్స్ కోసం మహేష్ బాబు స్పెషల్ పోస్ట్ చేశారు.

థాంక్స్ గుంటూరు నా సొంత ఊరిలో అంత మంది మధ్యలో సినిమాని మీ ప్రేమాభిమానాలు మధ్య సెలబ్రేట్ చేసుకోవడం చిరకాలం నాకు ఒక జ్ఞాపకంలా హృదయానికి దగ్గరగా ఉండిపోతుంది అని మహేష్ బాబు పోస్ట్ లో పెట్టారు. మీ అందరినీ మళ్ళీ కలవాలి అని అనుకుంటున్నా అతి త్వరలో.. సంక్రాంతి మొదలయింది. సినిమా ఈవెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూసుకున్న గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్ వారి సపోర్ట్ కి థాంక్స్ అని అర్థం వచ్చే విధంగా స్పెషల్ పోస్ట్ ని ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news