వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే.. నేడు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీర్ఎస్ సమీక్షా సమావేశం నిర్వహించనుంది. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ములుగు, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, ఇల్లందు, పినపాక, భద్రాచలం నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు.
మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీర్ఎస్ సమీక్షా సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర సీనియర్ నేతలు హాజరుకానున్నారు. కాగా, నిన్న వరంగల్ లోక్సభ నియోజకవర్గ సన్నాహాక సమావేశానికి వెళ్లిన వాళ్ళను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విషయాలు చెప్పారు. విధ్వంసమైన తెలంగాణను కేసీఆర్ వికాసం వైపు మళ్లించారని అన్నారు.
అలానే తెలంగాణను సత్వరంగా అభివృద్ధి చేయాలని 99 శాతం సమయాన్ని పాలనకే కేసీఆర్ కేటాయించారన్నారు. గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడ్డంతగా ఎవరూ కష్టపడలేదన్నారు. ప్రజలు మనతో ఉన్నారనే ధీమాలో ఎన్నికల దాకా ఉన్నాం అని అన్నారు కేటీఆర్. ఉద్యమాల వీరగడ్డ ఓరుగల్లు. వరంగల్ జిల్లా లోనూ నిత్యం అందుబాటులో ఉండే మన నేతలు ఓడిపోయారు అని గుర్తు చేసారు.