ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ రాజస్థాన్ మంత్రి బాబులాల్ ఖరాడీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఎంతమందిని కన్నా అందరికీ ప్రధాని నరేంద్ర మోడీ ఇళ్లు కట్టిస్తారని వ్యాఖ్యానించారు. ఎవ్వరూ పస్తులు పడుకోకూడదు. అందరికీ నీడ ఉండాలనేదే మోడీ కల. ఆయన అందరికీ ఇళ్లు ఇస్తారు. మీరు మాత్రం ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని కనండి చాలు. అందులో మీకేంటి సమస్య..? అని ప్రశ్నించారు. రాజస్థాన్ మంత్రి వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
తలపై కప్పు లేకుండా ఎవరూ ఆకలితో నిద్రపోకూడదనేది ప్రధాని కల అని అన్నారు. “ఎవరూ ఆకలితో, తలపై కప్పు లేకుండా నిద్రపోకూడదన్నది ప్రధానమంత్రి కల. కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ ధరలను రూ.200 తగ్గించిందని, రాజస్థాన్‌లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉజ్వల పథకం కింద రూ.450కే సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాషాయ పార్టీ అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని బాబులాల్ ప్రజలను కోరారు.