దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం సంభవించింది. గురువారం మధ్యాహ్నం సమయంలో రాజధాని నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.
భారత రాజధాని ఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్ చండీగఢ్ వంటి ప్రాంతాల్లో ఇవాళ 30 సెకండ్ల పాటు భూమి కనిపించింది. ఈ భూకంప కార్యకలాపాల పర్యవేక్షణ కోసం భారత ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ నేషనల్ సెంటర్లోని ఫైజాబాద్ లో గల భూకంప కేంద్రంలో రిజిస్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 6.3 శాతం గా నమోదయింది. అనుకోని పరిణామంతో ప్రజలందరూ ఒక్కసారిగా ఇండ్లలోంచి బయటకి పరుగులు తీశారు. ఒక పాకిస్తాన్ మీడియా నివేదికల ప్రకారం లాహోర్ ఇస్లామాబాద్ ఫైబర్ నగరాల్లో మధ్యాహ్నం రెండు 50 గంటలకు భూకంపం సంభవించింది.