Telangana : ఆమ్రపాలికి కీలక బాధ్యతలు

-

Telangana : ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్ రెడ్డి. HMDA జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. HMDA పరిధిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ, ఎస్టేట్ విభాగం, అర్బన్ ఫారెస్ట్రీ వింగ్ వ్యవహారాల బాధ్యతలు కేటాయించింది.

Key Responsibilities of Amrapali

ఇప్పటికే ఆమె మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MDగా ఉన్నారు. మూసీ సుందరీకరణలో భాగంగా ఆమె ఇటీవల గుజరాత్, ఢిల్లీలో పర్యటించారు. అక్కడి ప్రాజెక్టుల పనితీరు పరిశీలించారు. కాగా,తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నాడని సమాచారం అందుతోంది. బకాయిలు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్ అందించేందుకు సిద్ధం అయ్యారట. గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం ప్రజా పాలనలో లక్షలాదిమంది దరఖాస్తు చేసుకున్నారు.

ఈ నెలాఖరులోగా పథకం అమలుపై మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. కాగా వేలాదిమంది కొన్ని నెలలు, ఏళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోయాయి. GHMC పరిధిలోనే ఏకంగా రూ. 6 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. పూర్తిగా క్లియర్ చేయకపోతే వారికి పథకం అమలు కష్టమేనని అధికారులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news