జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కాపునేత ముద్రగడ పద్మనాభం వచ్చేవారం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేనకు చెందిన పలువురు కాపు నేతలు ముద్రగడతో వరుసగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కు ఇవ్వాలని కోరుతూ ఓ లేఖను జనసేన ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాస్ కు ఆయన ఇచ్చినట్లు సమాచారం.
ఆ లేఖ పవన్ కు చేరిన అనంతరం జనసేనలో ముద్రగడ చేరికపై, వారిద్దరి భేటీపై స్పష్టత రానుంది. కాగా ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరతారనే దానిపై ముద్రగడ కుమారుడు గిరి బాబు స్పందించారు. టీడీపీ, జనసేన ఏ పార్టీలోకి అయినా వెళ్లే అవకాశం ఉంది…వైసీపీలోకి వెళ్లడానికి పద్మనాభం ఇంట్రెస్ట్ చూపడం లేదని పేర్కొన్నారు. ఇద్దరు పోటీ చేయడానికి ఆసక్తిగానే ఉన్నాం, ఏదైనా పార్టీలో చేరిన తర్వాత నిర్ణయం ఉంటుందని చెప్పారు ముద్రగడ కుమారుడు గిరి బాబు.